“నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారులు కొండముది సుబ్బారావు సంస్థ రెసిడెంట్ సెక్రెటరీ రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య అడ్మినిస్ట్రేటరుగా, అంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా ప్రశంసించి వారితో తమకు గల అనుబంధాలను గుర్తుచేసుకొన్నారు. ఒక వ్యక్తి రచనలకు పి.హెచ్.డి పట్టాను ఇవ్వడం ఎంతో గర్వకారణం అని తెలుగు విభాగంలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఎల్. మృదులగారిని సభాముఖంగా అభినందించారు. కార్యక్రమంలో కొండముది సోదరులు నాగేశ్వరరావు, ప్రేమ్కుమార్ గారు రవి సంస్థకు నగదు విరాళాన్ని ఇస్తున్నట్లుగా సభలో తెలియజేశారు. కొండముది రవిగారు అన్నయ్య రాసిన పాటలను గానం చేసి ఈ సందర్భముగా సంపూర్ణ విద్యార్థులుగా ఎంపికైన ఎన్. ప్రవీణ్ బి.ఏ. IIIrd Year, దుర్గాప్రసాద్ 10th Class లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణగారు తమ తల్లితండ్రుల స్మృత్యర్థం ఫైనల్ ఇయర్ చదువుతున్న వి. శ్రావణి బి. ఏ. III Tel, యు. కృష్ణ బి.ఏ. III Tel లకు బహుమతులు అందజేశారు. అంతేగాక నంబూరి చింజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్. నవ్య (10th) కె. భరత్సాయి 10th విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.