మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ విద్యార్థులు తమ గురువులు సంస్కారవంతమైన చదువుతో మమ్మల్ని తీర్చిదిద్దారని తెలియజేశారు. డా॥ యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అథ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులతో తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగిస్తుంది. ఎలా వారు పోటీ పరీక్షలలో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమ్కుమార్కు పూర్వవిద్యార్థులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.