జిల్లెళ్ళమూడి అందరింటిని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులలో కొండముది రామకృష్ణ ఒకరని జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థల చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు వివరించారు. ఆగస్టు 23 న కళాశాలలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా॥ బి.యల్. సుగుణ గారు మాట్లాడుతూ, అమ్మ తత్త్వాన్ని దైవత్వాన్ని దీనులపాలిట ఆదరణను కొండముది రామకృష్ణ ఆరాధించినట్లు, అమ్మ నామ సంస్మరణే నిరంతర శ్వాసగా, ధ్యాసగా జీవించిన ధన్యజీవి అని తెలిపారు. ముఖ్య అతిథి, ప్రముఖవక్త ప్రభాకరస్వామీజీ (హైదరాబాదు) పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ ఫౌండేషన్ తరఫున సంపూర్ణ విద్యార్థి అనే పేరుతో ఎ.మనీషా, జె. రామారావు లకు జ్ఞాపిక, నగదు బహుమతిగ అందజేశారు. ఇదే వేదికపై చక్కా శ్రీమన్నారాయణ గారు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, యల్. కరుణ, కె. మణికంఠ, హరీష్ గుప్తా, ప్రభృతులకు వస్త్రాలు, నగదు బహుకరించారు.