పాఠ్యగ్రంథాలతో పాటు నైతిక, ధార్మిక విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు సాధించుకోవాలని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు హితవు పలికారు. డిసెంబరు 28న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా నానాటికీ అభివృద్ధి చెందుతున్నదని ఆయన తెలిపారు. ఈ సభలో విజయవంతంగా విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన రామబ్రహ్మంగారికి శ్రీ సుధామ వంశీగారు అభినందనలు తెలిపారు.