మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరాఘవ మూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనామందిరంలో ఆయన మాట్లాడుతూ ఏ దేశానికి తీసిపోని విధంగా అంతరిక్షప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్.సుగణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉపగ్రహప్రయోగాల తీరుతెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన ఫైనలియర్ విద్యార్థినులు ఎ. మనీషా, టి. నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా|| బి.యల్.సుగుణగారు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయక విద్యలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం ఎంతో అవసరమని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రాఘవమూర్తిగారు ప్రకటించారు. ఈ రంగాలలో భారతదేశానికి సముచితస్థానం లభించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు సమర్ధవంతంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగదు బహుమతితో అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్, శ్రీ ఎన్. లక్ష్మణరావు, శ్రీ ఎమ్. శరచ్చంద్రకుమార్, శ్రీ రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.