“కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి” అని అమ్మ చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ గారు. వీరు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ తమ దగ్గరకు వచ్చిన రోగులను ఆదరించి వైద్యం చేయడం విశేషం. వీరు ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అమ్మ భక్తులైన శ్రీ బ్రహ్మాండం. రంగసాయి (అమెరికా) గారి సహాధ్యాయిని. అమ్మ గురించి రంగసాయి గారి మాటల్లో విని అమ్మను దర్శించాలనే కోరికతో జిల్లెళ్ళమూడి విచ్చేశారు. అంతేకాక అమ్మ స్వయంగా స్థాపించిన కళాశాలకు వచ్చి అధ్యాపకులతో కలిసి ఇక్కడ విశేషాలను గురించి తెలుసుకొన్నారు. విద్యార్థులతో మమేకమై వారితో సంభాషించారు. విద్యార్థులకు వివిధ రకాల వైద్య సలహాలు ఇచ్చారు. అమ్మ సేవలో ఉంటూ నిరంతరం విద్యనభ్యసించడం మీ పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభావేదికపై విశ్వజననీ పరిషత్ సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మాట్లాడుతూ అమ్మపట్ల రంగసాయి గారికి అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనమే ఈ రోజు జ్ఞానప్రసూనాంబ గారి ఆగమనం అని తెలియజెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.