చరిత్రను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదని శ్రీనాధ సాహితీ పరిషత్ (నర్సరావుపేట) నిర్వాహకులు శ్రీ స్వర్ణ చినరామిరెడ్డి ఆగష్టు 7 వ తేదీన వివరించారు. సీనియర్ ఫాకల్టీ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ సమాజస్థితిగతులను చరిత్ర ఎప్పటికప్పుడు వివరిస్తుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కళాశాల చరిత్ర అధ్యాపకులు శ్రీ కాశీభట్ట సత్యమూర్తి మాట్లాడుతూ చరిత్ర గమనాన్ని పరిశీలించి ఉత్తమ విధానాలను అలవరచుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి చరిత్ర అధ్యాపకులు శ్రీ జి. రాంబాబు గారు స్వాగతం పలికి శాసనాలు, తాళపత్ర గ్రంథాలు దేశవిదేశీ ప్రముఖుల రచనలు చారిత్రక సత్యాలను చాటి చెబుతాయని పేరొన్నారు.