రవాణారంగం పటిష్టంగా ఉండాలంటే రోడ్డురవాణా భద్రత ముఖ్యమని వెదుళ్లపల్లి SI వివరించారు.  నవంబరు 24 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యం.మోహన్  పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు.  నియమ నిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అలవరుచుకోవాలని అయన తెలిపారు. చట్టాలను పాటించడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థుల కర్తవ్యమని సూచించారు.  ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చట్టాలు పాటించడంతోపాటు సమాజ శ్రేయస్సుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.