రవాణారంగం పటిష్ఠంగా ఉండాలంటే రోడ్డు రవాణా భద్రత ఎంతో ముఖ్యమని వెదుళ్లపల్లి యస్.ఐ. శ్రీ యమ్.మోహన్ వివరించారు. 2018 నవంబరు 24వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యస్.ఐ. పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్గారు డా.ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు. క్రమశిక్షణలో నియమనిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అ లవరచుకోవాలని ఆయన హితవు పలికారు. చట్టాన్ని గౌరవించడం ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వటం విద్యార్థుల కర్తవ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సమాజప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.