లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్ మూర్తి వివరించారు. ఆగస్టు 13వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బి.రామబ్రహ్మం గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ యల్. సుగుణగారు పర్యవేక్షించారు. సంస్థ చీఫ్ ప్యాట్రన్ డా. బ్రహ్మాండం రవి,ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. దేశాభ్యుదయం. కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో. మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్. ఆర్. మూర్తి గారు సోదాహరణంగా వివరించారు. అధ్యక్షులు శ్రీ బొప్పడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, దైవభక్తి, మానవసేవ, అభివృద్ధి సాధన లక్ష్యాలుగా కృషి వివరించారు. కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ ఆకలి, పేదరికం, అసమానతలు సమాజంలో తొలగిపోవాలని ఇది అమ్మ లక్ష్యమని సోదాహరణంగా తెలిపారు. యస్. ఆర్. మూర్తి గారిని నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. సంస్థ పెద్దలు శ్రీ.యమ్. దినకర్ , యమ్.శరచ్చంద్ర. యన్. లక్ష్మి, శ్రీరామ్మూర్తి, డి రామచంద్ర, వసుంధరక్కయ్య, ప్రధానో పాధ్యాయులు,   కె ప్రేమకుమార్ అధ్యాపక సిబ్బంది. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.