సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్ద కాలుష్యం నానాటికీ అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ సుధామ వంశీ అధ్యక్షత వహించారు. కాలుష్య నివారణలో, ఆరోగ్య సాధనలో యోగా విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు డా॥ కె. సత్యమూర్తి వివరించారు. సంగీతశాస్త్రం మానవ జాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని డా.కె. సూర్యమూర్తి సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు