ఉత్తమ ఫలితాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు ముందుకు సాగాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ డి. పద్మజ గారు ఆగష్టు 4 వ తేదీన వివరించారు. డా|| పద్మజ మాట్లాడుతూ లక్ష్యంలేని విద్యాభ్యాసం నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ఆశయ సాధనకోసం ఉన్నతమైన లక్ష్యాలతో ప్రగతిపథంలో పయనించాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. వివిధ ప్రశ్నలు సంధిస్తూ విద్యార్థుల నుండి సమాధానం రాబడుతూ డా॥ పద్మజ చేసిన ప్రసంగం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విద్యార్థులను ఆకట్టుకుంది. ఇదే వేదికపై పెద్దలు శ్రీ యన్. లక్ష్మణరావు, తెలుగు అధ్యాపకులు మధుసూదనరావు తదితరులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పద్యాలను గానం చేసి అందరినీ అలరించారు.