DRUG AWARENESS PROGRAM

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో March 19 20 25 న డ్రగ్ పై అవగాహన మరియు దుర్వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సభలో ప్రిన్సిపల్ డా. A.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థుల మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ Academic Excellence పై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య నోరులేని జంతువులు కూడా దూరంగా ఉంచే పొగాకు లాంటి హానికారకాలకు మనం దూరంగా ఉంటూ మన చుట్టూ పక్కల వారికి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సభకు అతిథిగా విచ్చేసిన మూలపాలెం సచివాలయం మహిళా పోలీస్ అధికారి Zion Perpetua Nathala ప్రతి ఒక్క విద్యార్థి సమాజం పట్ల బాధ్యత వహించి తాను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులకు దీనిపై అవగాహన కలిగించేలా సామర్థ్యాన్ని కలిగి ఉండాలని వివరించారు. 80 మంది విద్యార్థినులు 22 మంది విద్యార్థులు 10 మంది అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల మాదకద్రవ్యాల దుర్వినియోగం ద్వారా కలిగే ప్రమాదాలను గురించి అవగాహన కల్పించడంలో ఎంతగానో తోడ్పడింది. EAGLE CLUB CO ORDINATOR  B.సుకన్య అధ్యాపకులకు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.