WORLD AIDS DAY

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో డిసెంబరు 1వ తేదీ ఆదివారం సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్  డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎయిడ్స్ రావడానికి కారణాలు, నివారణమార్గాలు విద్యార్థులకు తెలిపారు. అనంతరం చరిత్ర ఉపన్యాసకులు పి. సుందరరావు గారు ఎయిడ్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాపించి ఉందో గణాంకాలతో తెలిపి అతి త్వరలో ఎయిడ్స రహిత ప్రపంచంగా మారడానికి అందరూ కృషి చేయాలని, ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని భయపడకుండా నివారణోపాయాలను తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు సాహిత్, మీనాక్షి, శ్రీలక్ష్మి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను చక్కగా వివరించారు. అనంతరం కళాశాల మైదానం లో విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి మానవహారం నిర్వహించారు. అంతే కాక జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ ర్యాలీ గా గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు అవగాహన కలిగించారు.

          ఈ కార్యక్రమంలో భాగంగా కమీషనరేట్ ఆప్ కాలేజియేట్ వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు పోష్టర్ పెయింటింగ్, పెయింటిగ్, రంగవల్లుల పోటీలు ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలన ప్రతిబింబించేవిధంగా పోటీలు నిర్వహించబడ్డాయి.