ఓరియంటల్ కళాశాల ఉన్నతప్రయోగాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తుందని విశ్వజనని సంస్థ అధ్యక్షులు దినకర్ సగర్వంగా తెలియజేశారు. 15.3-2020 ఆదివారం, జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయం ప్రాంగణంలో ‘కెరీర్ గైడెన్స్ సెల్-2020″ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుభాష అభివృద్ధికి ఓరియంటల్ కళాశాలలు మూలస్థంబాల లాంటివనీ, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తున్నాయని దినకర్ గారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు టీచర్ ట్రైనింగ్ ఎంట్రన్స్ వ్రాయడానికి తగిన తర్ఫీదు ఇవ్వడం కోసం కళాశాల ప్రిన్పిపాల్ డా. వి. హనుమంతయ్య గారు ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SVIP వారి  సహకారంతో విద్యార్థులకు ఉచితంగా ఈ కోచింగ్ ఇస్తున్నట్లుగా హనుమంతయ్య గారు తెలిపారు. కోచింగ్ తీసుకున్నవారు ప్రభుత్వ టీచరు ఉద్యోగాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కారక్రమంలో సంస్థ పెద్దలు వై.వి.శ్రీరామ్మూర్తి గారు, శరచ్చంద్రగారు పాల్గొన్నారు.