కార్తీక వన సమారాధన
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ప్రతి ఒక్కరూ మైత్రీ భావంతో మెలిగేందుకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ పలు క్రీడా , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ యేడాది డిసెంబరు 1, ఆదివారం నాడు కార్తీక వనసమారాధన ను ఏర్పాటు చేశారు. ప్రాచీన కవుల కావ్యాలలో మనం చూసే ప్రకృతి వర్ణనలు పరిశీలించినట్లయితే వారు భావితరాలకు అందించిన దివ్యౌషధాల సమాహారం తెలుస్తుందని కనుక ఈ సమారాధన లో ఎన్నో ఆరోగ్య సంబంధ విషయాలు
ఇమిడి ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ విద్యార్థులకు తెలియజెప్పారు. సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులను సమైక్యంగా ఉంచడం, చైతన్య వంతులుగా చేయడమే లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో SVJP TRUST పెద్దలు సాయిబాబా గారు, దినకర్ గారు పాల్గొన్నారు. పూజానంతరం అధ్యాపకులు విద్యార్థులు స్నేహపూరిత వాతావరణంలో భోజనాలు పూర్తి చేశారు. సాయంత్రం విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు.