బాలికల మరియు బాలుర వసతి గృహములలో అమ్మ ఆగమనోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20, 2025 బుధవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, శ్రీ కామరాజు గారు మరియు పలువురు సంస్థ పెద్దలు, కళాశాల అధ్యాపకులు బృందం పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
ఫిబ్రవరి 21వ తేదీ గురువారం రోజున విద్యార్థుల వసతిగృహంలో అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మ తనయులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మరియు సంస్థపెద్దలు విచ్చేశారు. విద్యార్థులు అందరూ ముక్తకంఠంతో లలితా సహస్రనామ పారాయణ చేశారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక మానసిక చైతన్యాన్ని కలిగించే ఈ కార్యక్రమాలు అందరినీ ఐకమత్యంతో ఉంచేందుకు సహకరిస్తాయని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. యల్. మృదుల అన్నారు. పూజానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించగా శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.