మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిగణపతి ఉత్సవాలు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులచే “విద్యార్థి గణపతి” ఉత్సవాలు మూడు రోజులు(7.9.24 నుండి 9.9.24) అంగరంగ వైభవంగా నిర్వహింప బడ్డాయి. విద్యార్థిగణపతి మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు షోడశోపచార, అష్టోత్తర శతనామములతో శాస్త్రోక్తంగా అర్చన, ‘శమంత కోపాఖ్యానము’ కథా శ్రవణం జరిగింది.అనంతరం విద్యార్థులు లఘునాటికలు, నృత్య ప్రదర్శనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో వరసిద్ది విద్యార్థిగణపతికి కళార్చన చేశారు.
రెండో రోజు గణపతిని యధావిధిగా పూజించుట, సంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మూడో రోజు గణపతినకి శాస్త్ర ప్రకారం పూజ, ఉద్వాసన మరియు నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ విద్యార్థి గణపతి ఆరాధనోత్సవాలలో SVJP TRUST పెద్దలు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులందరూ చక్కగా, చూడముచ్చటగా ‘విద్యార్థి గణపతి’ని ఆరాధించడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం స్వీకరించడం జరిగింది.