మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదాః. గోసంరక్షణ ద్వారా దేశసంరక్షణ జరుగుతుందని మనకి శాస్త్ర వచనం. మాతృశ్రీ గోశాల లో గోసంరక్షణ లో భాగంగా కళాశాల పూర్వ విద్యార్థులు గోవులకు కావలసిన గడ్డి మొదలైనవి అందించారు. ప్రస్తుత విద్యార్థులు గోవులను సంరంక్షించే విధానాన్ని అక్కడి సంరక్షకుడి ద్వారా తెలుసుకొని పంచగవముల ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు. మాతృశ్రీ గోశాల పంచగవముల లో గోమయాన్ని స్వీకరించి కెమికల్స్ లేకుండా ధూప్ స్టిక్స్ ను తయారు చేస్తుంది. ఈ తయారీని విద్యార్థులు నేర్చుకోవడమే కాక గ్రామస్తులకు వాటిని గురించి వివరించి హానికారకాలైన ధూప్ స్టిక్స్ ను తీసేసి గోమయం తో తయారవుతున్న ధూప్ స్టిక్స్ ను ఉపయోగించమని అవగాహన కల్పించారు.

“Mothers of all beings, cows provide all happiness. According to our scriptures, protecting cows is equivalent to protecting the nation.”

As part of cow protection at the Matrusri Goshala, Alumni of the college provided necessary fodder and other supplies for the cows. Current students learned about the methods of cow protection from the caretaker there and understood the significance of Panchagavyas. Matrusri Goshala uses cow dung to make incense sticks without chemicals. The students not only learned this process but also educated the villagers about it, encouraging them to replace harmful incense sticks with those made from cow dung.