Flood relief food drive – Service our community
సెప్టెంబర్ 3న శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, జిల్లెళ్ళమూడి ఆధ్వర్యంలో కొల్లేరు సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 వేల ఆహార (అన్నప్రసాద) వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు, మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పెసర్లంక, గాజుల్లంక, పెదలంక, చింతల్లంక, శద్ధలంక, చిరువోల్లంక గ్రామాలలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసి, వారికి సహాయం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు అయ్యారు.
ఈ Social Service లో పాల్గొనడం వలన సమాజంలో సమస్యలు ఎదురైన వారిపట్ల తమవంతు సహకారం ఎలా అందించాలో విద్యార్థులు తెలుసుకోగలిగారు. అందరూ కలిసి ఈ కార్యమాన్ని పూర్తిచేయడానికి చేసిన కృషిని స్వయంగా చూసి టీమ్ వర్క్ వలన కలిగే ప్రయోజనాలు గ్రహించారు. ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో ప్రతిస్పందించాలని నేర్చుకోగలిగారు. ఇటువంటి కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వ్యక్తిగతమైన అభివృద్ధితో పాటు సామాజికబాధ్యత ను నేరవేర్చాలనే స్పృహ కలిగి ఉంటారు. అమ్మ ఈ కళాశాలను స్థాపించిన లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతారు.