మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృతవిభాగం తరుపున 26-12-2024 గురువారం రోజున అతిథి ఉపన్యాసం ఏర్పాటయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం Head of the Department Prof. విద్యానంద ఆర్య విచ్చేసి సంస్కృతభాష అధ్యయనం – ప్రయోజనాలు అనే అంశంపై ప్రసంగించారు. వీరు ఆధునిక సమాజంలో సంస్కృతభాషపై జరుగుతున్న వివిధ రకాల పరిశోధనలను తెలిపి భావితరాలకు అందబోతున్న సదవకాశాలను గురించి సవివరంగా తెలియజెప్పారు. అంతేకాక లక్షల సంవత్సరాల నుండి ఉనికిని కలిగి ఉన్న సంస్కృత భాష అన్నిభాషలకు మాతృభాష అనీ, సంస్కృతభాషలో ఉచ్చారణ పరంగా, ప్రాంతాల వారీగా, దశాబ్దాలవారీగా గానీ ఏవిధమైన మార్పులు జరగలేదనీ తెలిపారు. ప్రాంతీయ భాషాలు వివిధ దశలలో వివిధ రకాల మార్పులు సంతరించుకుంటుంటాయని సకలభాషలకు తల్లివంటిది కనుక ప్రతిభాష సంస్కృతం నుండే పుట్టిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభను సంస్కృతవిభాగాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు నిర్వహించగా డా. వి. త్రయంబకం గారు వందన సమర్పణ గావించారు.