మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మనం ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 08.03.22 మంగళవారంనాడు మహిళాదినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి మరియు రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో డాక్టర్ మృదుల స్వాగత వచనాలతో సభ ప్రారంభం అయింది. ఆ సభలో శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అన్నె శివకుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగభేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసుగారు మంచి సంస్కారంతో ఉన్న విద్యార్థులను చూసి ఆనందించి సంస్కృతం మరియు తెలుగులో ఎక్కువ మార్కులు సాధించినవారికి ప్రమాణ పత్రాలను అందించారు. పి.గిరిధర్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఐ. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ తల్లిగా చెల్లిగా సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళుతుందని వివరించారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిగా సంస్కృతోపన్యాసకురాలు డా॥ వి.పావని వందన సమర్పణ గావించారు. శాంతిమంత్రాలతో కార్యక్రమం ముగిసింది.