మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి (1980-1985), పూర్వ విద్యార్ధి సమితి అధ్యక్షులు శ్రీ గోగినేని రాఘవేంద్ర రావుగారిని పాలక వర్గం ఎంపిక చేసింది. శ్రీ రాఘవేంద్రరావుగారు 2023 జూన్ 26వ తేదీన ఈ బాధ్యతను స్వీకరించారు.
అమ్మ దివ్యానుగ్రహంతో డా. హనుమత్ ప్రసాద్ గారి సారథ్యంలో, శ్రీ రాఘవేంద్రరావుగారి నాయకత్వంలో కళాశాల అభ్యుదయపథంలో పురోగమించ గలదని ఆకాంక్షిస్తూ..
హనుమత్ ప్రసాద్ గారికీ శ్రీ రాఘవేంద్ర రావుగారికీ అభినందన పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాము.