అల్లూరి సీతారామరాజు జయంతి

   అతిపిన్న వయసులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడిగా ఘనతకెక్కిన అల్లూరి తరతరాలకు చిరస్మరణీయుడు.

జులై 4వ తేదీ గురువారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుని జయంతి సభ జరిగింది. ఈ సభకు డా. V. హనుమంతయ్య ప్రాతినిథ్యం వహిస్తూ దేశభక్తిని ఇనుమడింపచేసే స్వాతంత్రోద్యమకారుల చరిత్రను ఉద్యమస్ఫూర్తితో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాజీవనాన్ని చైతన్య పరిచే ఎన్నో ప్రబంధాలు సంస్కృతాంధ్ర భాషలలో ప్రతిబింబిస్తున్నాయి అటువంటి ప్రబంధాలను అధ్యయనం చేసి వారి అడుగుజాడలలో నడవాలని తెలియజేశారు. చరిత్ర విభాగ అధ్యక్షులు P. సుందరరావు గారి పర్యవేక్షణలో ఈ సభా కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలను వారి మాటల్లో స్పష్టపరిచారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

Alluri Seetharama Raju’s birth anniversary was celebrated at Matrusri Oriental College. Dr. V Hanumanthayya presided over the event, inspiring students to follow in the footsteps of freedom fighters like Alluri Seetharama Raju. Students enthusiastically presented speeches on his life and struggles.This program has conducted by P. Sundara rao Garu, HOD Dept. History. The program concluded with santhi mantra.