మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆగస్టు 15 2024న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ పెద్దలు శ్రీ ఎం దినకర్ గారు పతాకావిష్కరణ గావించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ మృదుల గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మాటలతో గీతాలాపన కోలాట ప్రదర్శన పిరమిడ్స్ వంటి ప్రదర్శనలతో దేశభక్తిని చాటి చెప్పారు. అనంతరం సభా వేదికపై శ్రీ ఎం దినకర్ గారు ముఖ్య అతిథి సంభాషణ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమం నాటి విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సభలో శ్రీ మేళ్లచెరువు సాయిబాబు అన్నయ్య గారు మాట్లాడుతూ కళాశాల NAAC B++ గుర్తింపు పొందినందుకు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించి, విద్యార్థులను కేవలం పాఠ్యభాగాలలో ఉన్న అంశాలు కాకుండా గ్రంథాలయమును సద్వినియోగం చేసుకోమని సూచించారు. అనంతరం ప్రతిభావంతులు, మరియు పేద విధేయ విద్యార్థులకు అమ్మ భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చే ఉపకార వేతనాలు పెద్దలచే అందజేయబడ్డాయి కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శాంతి మంత్రం తో ఈ సభ ముగిసింది. అదే విధంగా యోగదా చారిటబుల్ ట్రస్ట్, గుంటూరు వారు స్వతంత్రదినోత్సవం రోజున అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ఆర్గానిక్ Tree Flags ను మన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కు అందజేశారు. కళాశాల అధ్యాపకులందరూ ఈ ఆర్గానిక్ Tree Flags ను ధరించి కార్యక్రమానంతరం వాటిని పాదులుగా చేసి నాటటం జరిగింది. కార్యక్రమంలో జిల్లెళ్ళమూడి గ్రామవాసులకు కూడా అవగాహన కల్పిస్తూ గ్రామ సర్పంచ్ జి. లక్ష్మి గారి నేతృత్వంలో పరిసర ప్రాంతాలలో విత్తనాలు నాటే కార్యక్రమం జరిగింది.