గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి.  విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించి వారిలో ఆలోచనా పరిధిని విస్తృతం చేసేందుకు గాను 14,15,16  తేదీలలో ఈ కార్యక్రమాలు జరిపారు.

మొదటి రోజు శ్రీ M. S. శరచ్చంద్రగారు ఆన్ లైన్ ద్వారా ప్రసంగిస్తూ విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను మరియు మన కళాశాలలో ఉన్న అమూల్యమైన సంస్కృతాంధ్ర గ్రంథాలను వినియోగించుకోవాలని తెలియజేశారు.   అనంతరం సంస్కృతాంధ్ర గ్రంథాల ప్రదర్శన విద్యార్థులకు విశేషంగా ఆకట్టుకుంది. వివిధ గ్రంథాలను పరిశీలించడం ద్వారా వారు కొత్త విజ్ఞానాన్ని పొందగలిగారు.

రెండవ రోజు విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్త్రత్వ పోటీలు జరిగాయి. PDC మరియు DEGREE స్థాయిలలో జరిగిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మూడవ రోజు సాయంత్రం కళాశాల ఉప ప్రాచార్యురాలు శ్రీమతి L. మృదుల గారి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సభలో వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతో పాటు BEST LIBRARY USER AWARD అందించారు. Librarian R. రమ్య మూడురోజులపాటు విద్యార్థులను ఉత్సాహపరచి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పుస్తక పఠనంతో జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకోవాలని అధ్యాపకులు సూచించారు.