గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే సోపానాలు. నేటి విద్యార్థులు సాంకేతికతతో ముందడుగు వేస్తూ స్వమేధస్సును మరచిపోతున్నారు. ఈ తరుణంలో గ్రంథాలయ పితామహుడైన డా. యస్. ఆర్. రంగనాథన్ గారి జన్మదినం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ లో ఓరియంటల్ కాలేజ్ డిజిటల్ క్లాస్ room లో  గ్రంథాలయాధికారిదినోత్సవం  జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా నిర్మల్ గవర్నమెంటు డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ డా. ఆర్. నాగేశ్వర్ గారు ప్రసంగించారు, పుస్తకపఠనం యొక్క ఆవశ్యకత తెలుసుకొని అభిరుచి పెంచుకుంటే పుస్తకమే నిజమైన స్నేహితుడిగా ఉంటుందని, గ్రంథాలయాలను ఒక ప్రణాళికా బద్ధంగా నిర్వహించడం ద్వారా అందరికీ ఆసక్తి కలిగించవచ్చునని చెప్పారు. సాంఘిక సంస్కర్తలనుండి సాహిత్యవేత్తల వరకు ప్రజాచైతన్యాన్ని పుస్తక రచనల ద్వారానే తీసుకురాగలిగారని కనుక విద్యార్థులు పుస్తకపఠనం అలవరచుకోమని ఈ సందర్భంగా వివరించారు. కళాశాల లైబ్రేరియన్ ఆర్. రమ్య ఈ గెష్ట్ లెక్చర్ ను గూగుల్ మీట్ ద్వారా ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులందరూ మా విరామ సమయాలలో తప్పనిసరిగా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ & అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.