జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు జిల్లెళ్ళమూడి గ్రామసమీపంలో ఉన్న అప్పాపురం గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు, యువతకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని అందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని ప్రజాస్వామ్యంలో ఇది తప్పనిసరి అని అందరికీ అవగాహన కల్పించారు.అప్పాపురం గ్రామ సచివాలయం నుండి మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని అన్ని వార్డులను సందర్శించి  గ్రామస్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అంతేకాక యువత అందరూ కూడా దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కనుక అందరిని ఓటు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సచివాలయం కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించారు. అప్పాపురం గ్రామ సర్పంచ్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అందిస్తున్న సామాజిక స్పృహను అభినందిస్తూ కళాశాల వాలంటీర్స్ అందరిని కూడా అభినందించారు.