ఉపాధ్యాయదినోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో 2024, సెప్టెంబర్ 5 వ తేదీ గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినూత్నమైన విద్యాబోధనను అందించడానికి విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చొరవ చూపించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉపాధ్యాయపాత్రలను పోషించి తమ జూనియర్ విద్యార్థులకు బోధించడానికి అవకాశం ఇవ్వబడింది.  ఈ విధంగా participative learning ద్వారా విద్యార్థులు విద్యాబోధనకు ముందుగా planning, presentation, communication, and interaction వంటి చర్యలలో కావలసిన నైపుణ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయుల పాత్రలను పోషించేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే collaborative learning  మరియు Peer to peer interaction పై దృష్టి సారించేందుకు ఎంతగానో ఉపకరించింది. విద్యార్థులు తమ గురుభక్తిని తెలుపుతూ గురువులను అందరినీ సత్కరించారు. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంత్యుత్సవాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరగతి గదులలో విద్యాబోధన జరుగుతున్న విధానం నుంచి సాయంత్రం సభానిర్వహణ వరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులందరూ విద్యార్థులకు ఆశీర్వాద వచనాలను అందించారు.