సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగించాలని కృష్ణాజిల్లా పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సీతారామ్ స్వామీజీ వివరించారు. ఆగష్టు 14 మంగళవారము కళాశాలలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన అనుగ్రహభాషణం చేశారు. ఈ సభలో అధ్యక్షులు శ్రీ రామబ్రహ్మంగారు పాల్గొన్నారు.స్వామీజీ మాట్లాడుతూ సంస్కృతాంధ్రలలోని వివిధ సూక్తులను, పద్యాలను ఉదాహరించి శ్రోతలను అలరించారు. సన్మార్గంలో జీవించడం, సాటి మానవులకు సహాయ సహకారాలు అందిచడం, విజ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలడం విద్యావంతుల కర్తవ్యం అని కార్యక్రమంలో హితవు పలికారు.