ఆధ్యాత్మిక ధార్మిక పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన “మానసిక స్థితికి తోడ్పడుతాయని ‘అమ్మలో అమ్మ‘ గ్రంథకర్త వేదాద్రి కేంద్రం నిర్వాహకులు, విశ్రాంతి అధ్యాపకులు అయిన స్వామి విరజా నందగిరి వివరించారు. ఈనెల 10వ గురువారం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సభలో అమ్మ గ్రంధావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉభయ పరిషత్తుల తరపున శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొని ప్రసంగించారు. కరస్పాండెంట్ శ్రీ.పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ అమ్మ అందరికీ మార్గదర్శకమని వివరించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్ర గారు మట్లాడుతూ అమ్మ మాటలు నిత్యసత్యాలని తెలిపారు. ప్రధాన వక్త E.C member శ్రీ యమ్. దినకర్ మాట్లాడుతూ చైతన్యస్వరూపిణి అయిన అమ్మ తత్వాన్ని అర్థంచేసుకొని ప్రగతిపథంలో పయనించాలని హితువు పలికారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా॥బి.ఎల్. సుగుణ మాట్లాడుతూ విశ్వంలోని సమస్త ప్రాణికోటీ అమ్మకు సమానమేనని సోదాహరణంగా తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథకర్త తె. నందగిరి స్వామిని కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామవంశీ ఘనంగా సత్కరించారు