భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు గారు వివరించారు. జులై 12వ తేది శుక్రవారం కళాశాల ప్రార్థనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా విబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణము అని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఎ.వి సుధామవంశీ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకన్న వేదాలు, ఉపనిషత్తులు సారస్వత వాఙ్మయం సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృతభాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తదనంతరం జరిగిన సంస్కృత శిబిర నిర్వహణ సభ్యులు పలువురు అభినందించారు. శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన విద్యార్థులందరికి శ్రీ ఆంజనేయప్రసాద్ గారు నగదు బహుమతి ఇచ్చారు.