సంస్కృతభాష మృతభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం తెలుసు కానీ సంభాషణ ద్వారానే భాష – అభివృద్ధి చెందుతుందని సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు అధ్యక్ష భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్థి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి బెంగుళూరు నుండి సంభాషణ సందేశః అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దన హెగ్దే గారు విచ్చేశారు.