సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన క్రోధాన్ని విడనాడాలని శ్రీ జి.యల్. మనోహర్ గారు తెలిపారు. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులు అధ్యాపకులు అమ్మ సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగి ఉన్నారని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. విద్యార్థులతో మమేకమై పలువిధాలుగా ప్రశ్నలు వేసి వారి నుండే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో చెప్పే విధంగా వారిని ఉత్తేజపరిచారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్ష భాషణం చేస్తూ వ్యక్తిత్వమనేది మానవునికి కనిపించని భూషణమనీ, మనలోని ఆలోచనలకు భావాలకు ప్రవర్తనకు సంబంధించిందే వ్యక్తిత్వమని వివరించారు.