రామాయణంలోని మానవీయ విలువలు నైతిక ఆదర్శాలు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలతో వర్ధిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారు వివరించారు. ఆగష్టు 14 వ తేదీన కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సాహిత్య సమావేశంలో ‘శ్రీమద్రామాయణం – అహల్య’ అనే అంశంపై మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.సుధామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని హితవు పలికారు. కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు. విశ్వజననీ సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, దర్శనం పత్రిక సంపాదక సభ్యులు శ్రీ ప్రసాదవర్మ కామఋషి, సంస్థ పెద్దలు శ్రీటి.టి. అప్పారావు, శ్రీచక్కా శ్రీమన్నారాయణగారు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పలువురు సందర్శకులు పాల్గొన్నారు.