కాళిదాస జయంతి

             మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 12.11. 24 వ తేదీన “కాళిదాస జయంతి”ని పురస్కరించుకుని సంస్కృత విభాగం వారు సభను నిర్వహించడం జరిగింది. తొలుత ఈసభకు అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.AVNG హనుమత్ ప్రసాద్ గారు  కాళిదాసు రచన వైశిష్ట్యాన్ని వివరించారు. సభకు విశిష్టాతిథి, ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీమతి Dr. SVSL ఫణి కామేశ్వరి గారు తమ ప్రసంగం లో కాళిదాసు రచనలు, వర్ణనా నైపుణ్యం,శైలి, ఉపమాలంకార ప్రయోగములు, మొదలగు విషయములను ఉదాహరణలతో వివరించడం జరిగింది. కార్యక్రమంలో పి. డి. సి. ఫస్టియర్ విద్యార్థిని వి. మీనాక్షి, BA OL తృతీయ సంవత్సరము విద్యార్థి పి. లక్ష్మయ్య మహాకవి కాళిదాసు గురించి మాట్లాడటం జరిగింది. ఎస్. దేవి బృందం  సంస్కృత గీతమును ఆలపించారు .సభా కార్యక్రమంలో చివర విశిష్టాతిథిని ‘అమ్మ ప్రసాదం’తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు సభా నిర్వహణ కళాశాల IQAC Coordinator Dr.V.పావని గారు నిర్వహించగా, సంస్కృత అధ్యాపకులు Dr.V. త్రయంబకం గారు,  వందన సమర్పణ చేయగా శాంతి మంత్రంతో సభను ముగించటం జరిగింది.