ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు commissioner of Collegiate Education మంగళగిరి వారు స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించేలా ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.02.2025, శనివారం కళాశాల క్రీడాప్రాంగణంలో విద్యార్థులు అధ్యాపకులందరూ కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. A.హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ వేరు వేరు డబ్బాలలో ఈ చెత్తను ఉంచడం చాలా అవసరమనీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛాంద్రను నిర్మించుకోవాలని తెలిపారు. సంస్కృత అధ్యాపకులు డా.వరప్రసాద్ గారు నెలల వారీగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలపై అధ్యాపకులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యర్థపదార్థాలను ఉపయోగించే విధానాన్ని జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. 70 మంది విద్యార్ధినులు 20 మంది విద్యార్ధులు 10 మంది ఆద్యాపకులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.  తడిచెత్త, పొడిచెత్త, అపాయకరమైన వ్యర్థాలను వేరుచేసి De-Compose  చేసి ఎరువులుగా తయారు చేసుకోవచ్చునని తద్వారా ప్రకృతిని కొంతైనా పరిరక్షించుకోగలమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీనిని పురస్కరించుకొని కళాశాలలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత –  ప్రాధాన్యత అనే అంశాలపై వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.