వాల్మీకి జయంతి
17-10-2024, గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వాల్మీకి జయంతి ని పురస్కరించుకొని ప్రత్యేక సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల పూర్వ చరిత్ర అధ్యాపకులు, రామాయణ రసభారతి బిరుదాంకితులు, విశ్వజనని మాసపత్రిక సంపాదకులైన శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు కళాశాల విద్యార్థులకు,అధ్యాపకులకు రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేసారు. సాహితీలోకానికి మార్గదర్శకుడైన వాల్మీకి మహర్షి భావుకతనూ, రచనా వైచిత్రినీ, శబ్ద గాంభీర్యమునూ శ్రీమల్లాప్రగడ వారు సభలో ఆవిష్కరించారు. వీరి ప్రసంగం విన్న విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో రామాయణం లోని లౌకిక, అలౌకిక అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలనే కుతూహలాన్ని కనబరిచారు. కళాశాల సంస్కృతవిభాగం పక్షాన జరిగిన ఈ సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి వాల్మీకి మహర్షికి పుష్పాంజలి ఘటించారు. విభాగాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మీయ అతిథి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.