నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశిరాజు కామరాజు గారు, వై. వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు. ఈ పోటీలకు నెల్లూరు ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణరాజు గారు పోటీ విధానాలను సూచించారు. ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పోటీలను నిర్వహించారు.