మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్లమూడిలో జనవరి 7,8,9తేదీలలో విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి వై.వి. శ్రీరామమూర్తిగారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు లక్కరాజు. సత్యన్నారాయణలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అధ్యాపకులు రాంబాబు, ఎ. హనుమత్ ప్రసాద్, వి.రోషన్, మురళీ, వర ప్రసాద్ గారు తమ సహకారం అందించారు. విజేతలకు ప్రిన్సిపాల్ గారు బహుమతులను అందజేశారు.