సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ  పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం. వారి సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీపోయారి శ్రీకాంత్ (సంస్కృత భారత కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మన ధర్మాన్ని గౌరవిస్తున్నాయని వివిధ విశ్వ విద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవ భాషగా, మధుర భాషగా, ప్రపంచ భాషగా సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విద్యార్థులు సంస్కృతంలో సంభాషించారు.   అధ్యాపకులు డా. కె.వి కోటయ్య డా. పావని డా. ఆర్ వర ప్రసాద్ సంస్కృత ప్రత్యేకతను, ప్రాముఖ్యాన్ని వివరించారు.