ఆత్మరక్షణ విధానాలను విద్యార్థినులు తెలుసుకోవాలని నాగజ్యోతి, విజయలక్ష్మి మహిళా పోలీసులు వివరించారు. మహిళలు ధైర్యంగా విపత్తులను ఎదుర్కోవాలని హితవు పలికారు. చట్టప్రకారం నిందితులను శిక్షించడంలో మహిళలు తమవంతు కర్తవ్యం నిర్వహించాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సోదాహరణంగా వివరించారు. ఆత్మరక్షణ పద్ధతులను ప్రయోగాత్మకంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, అధ్యాపకులు యల్. మృదుల, యమ్. కవిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.