జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ, విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదరావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, సంస్థ పెద్దలు, వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.యల్ సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ వి. రామచంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ శిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును “ఘనంగా సత్కరించారు. ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ.వి.రావు- “చంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు