ప్రముఖ పత్రికా సంపాదకులు, సాహితీవేత్త,  శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణ సభ 5-08-2020 లో జిల్లెళ్లమూడిలో జరిగింది. విశ్వజననీ పరిషత్ మాజీ ప్రెసిడెంట్ గా ఆయన గురుతర బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారని, ఆయన లోటు తీరనిదని బ్రహ్మాండం రవిగారు ఆవేదన వ్యక్తం చేశారు.   డిగ్రీ పట్టా లేకపోయినా, తన యొక్క (ప్రతిభా పాటవ ప్రదర్శనలో, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య మాట్లాడుతూ పొత్తూరి వారు నైతిక విలువలు కల్గిన పాత్రికేయులనడో సంశయం లేదన్నారు.  సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన వారుగా పేర్కొన్నారు. ఈ సభలో సంస్థ ప్రెసిడెంట్ దినకర్ గారు మాట్లాడుతూ అమ్మ భక్తుడైన పొత్తూరి వారు సంస్థ శ్రేయోభిలాషిగా మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలియజేశారు. భారతదేశ ప్రధానియైన పి.వి నరసింహరావు గారు తన విదేశీ పర్యటన విశేషాలను తెలియజేయడానికి పొత్తూరి వారే సమర్థులుగా పేర్కొనడం వారి ప్రతిభకు నిదర్శనం అని తెలియచేశారు.పొత్తూరి వారికి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలతో, సంస్థతో విడదీయలేని అనుబంధం ఉందని వారి మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.  నైతికతకు, వ్యక్తిత్వానికి పొత్తూరి వారు జీవితం నిదర్శనం అని కె. వి. కోటయ్య గారుఅన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.