12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన ప్రసంగించారు. శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు సభా నిర్వహణ చేశారు. శ్రీ గోలి రామచంద్రరావు ఆహ్వానం పలుకగా డాక్టర్. బి.శ్యామల వందన సమర్పణ చేశారు.
12.12.2021 సాయంత్రం ముగింపు సమావేశానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణ అధ్యక్షత వహించారు. గౌరవ అతిధి ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అమ్మ తనకు. ఏలా విద్యగనిపి పైకి తెచ్చింది చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరప్రసాదమూర్తి ప్రసంగించారు. శ్రీ ఆర్.వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. శ్రీ బౌరోతు శంకరరావు ఆహ్వానం పలుకగా శ్రీ ఐ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి వందన సమర్పణ చేశారు.
అందరింటి సభ్యులందరినీ పూర్వవిద్యార్థుల సమితి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ స్వర్ణోత్సవ వైభవం జిల్లెళ్ళమూడి అందరింటి విశిష్టతకు తగ్గట్టుగా అందరి మన్ననలు అందుకుంది.