విజ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించడం ఒక గొప్ప కార్యమని అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఓరియంటల్ కళాశాలకు ప్రముఖ సాహితీ -వేత్త ప్రవచన కళానిధి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు విచ్చేశారు. శుక్రవారం అన్నపూర్ణాలకు సమావేశమందిరంలో జరిగిన గురుపౌర్ణమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువును పూజించడం ధర్మమని వివరించారు. కళాశాల కరస్పాండెంట్ ఎ.వి.ఆర్ అంజనేయప్రసాద్ గారు అధ్యక్షతన వహించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణగారు సంస్థ పెద్దలు  దినకర్ గారు పాల్గొన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసే గురువును పూజించడం ప్రథమ కర్తవ్యమని సోదాహరణంగా వివరించారు. గురువు ప్రాధాన్యతను వివరిస్తూ  గ్రంథాల నుండి ఎన్నెన్నో విశేషాలకు వివరించారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువును గౌరవించాలన్నారు.  ఈ కార్యక్రమంలో  శ్రీ బ్రహ్మండం రవీంద్రరావు, వసుంధర అక్కయ్య, సంస్థ పెద్దలు N. లక్ష్మణరావు గారు పలువురు పెద్దలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.