by admin | Dec 10, 2021 | Orientation Programm
1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను ప్రారంభించి స్వర్ణోత్సవ విశిష్ట సంచిక ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ దినకర్ వచ్చారు. శ్రీ విశ్వజననీ పరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు “విశ్వజనని” మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రసిద్ధ ఉపన్యాసకులు ఆచార్య శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి స్వర్ణోత్సవ సంయోజన చేశారు.
ఉపసభాపతి శ్రీ రఘుపతి బాల్యం నుండి అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించి సంస్కృతాంధ్ర భాషల అభివృద్ధి జాతికి మేలు చేస్తుందని చెప్పారు. సంస్కృతికళాశాల అభివృద్ధికి కృషిచేసిన శ్రీ బొప్పూడి రామబ్రహ్మగారికి “జీవిత సాఫల్యా సేవా పురస్కారం” అందించి సత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తి నవభారత బాంక్ చైర్మన్ శ్రీ పాండురంగారావు శ్రీరామబ్రహ్మంగారిని గూర్చి ప్రసంగించారు. శ్రీదేశిరాజు కామరాజు గారు సభకు ఆహ్వానం పలికారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభా నిర్వహణ చేశారు.
మధ్యాహ్నం జరిగిన సభలో శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు సంస్కృతం ఈ జాతి జీవనాడి అంటూ చిన్నప్పటి తన అనుభవాలు అమ్మను చూడాలని జిల్లెళ్ళమూడిని దర్శించాలనే తన కోరిక ఈ రకంగా నెరవేరటం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ లక్కరాజు సత్యనారాయణ అమ్మతో తన అనుబంధాన్ని వివరించారు. పూర్వవిద్యార్థి సమితి విశ్వజననీ పరిషత్ కార్యవర్గసభ్యులను సత్కరించారు. పూర్వవిద్యార్థి శ్రీ యస్.యల్.వి.ఉమామహేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సాయంత్రం సామూహిక లలితాసహస్ర నామ పారాయణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడినవి.
by admin | Aug 9, 2021 | Orientation Programm
జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విజయవంతంగా అర్థ శతాబ్ది కాలంగా విద్యాసేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థులు వాడవాడలా స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆగష్టు 6, 7, 8, 9 తేదీల్లో ఈ మహోత్సవాలు అమ్మ ఆశయానికి అనుగుణంగా, నిరాడంబరంగా సార్థకంగా జరిగాయి. “జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి” పేరుతో తమతమ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవాలను సుసంపన్నం చేశారు. సభలు నిర్వహించి అమ్మ ప్రేమతత్వాన్ని, సేవా దృక్పథాన్ని పదిమందికీ చాటి చెప్పారు. తమ తమ ప్రాంతాలలో వివిధ రంగాలలో ప్రముఖులైన పెద్దలను అతిథులుగా ఆహ్వానించి, అమ్మ తత్త్వ ప్రచారాన్ని దీక్షతో నిర్వహించారు. తమకు విద్యాభిక్షపెట్టిన గురువుల సందేశాలను సభలలో వినిపించారు. జిల్లెళ్ళమూడిలో వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను స్మరించి వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని ప్రకటించారు. అమ్మ ప్రబోధించిన ప్రేమ, సేవ, పరోపకార పారీణత నిరాడంబరత మొదలైన ఉదాత్త గుణాలను పునశ్చరణ చేసుకున్నారు. ఈ ఉత్సవ నిర్వహణలోని ఆంతర్యాన్ని వెల్లడించారు. మాతృశ్రీ విద్యాపరిషత్, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలల వ్యవస్థాపకులు, నిర్వాహకులు అయిన పెద్దలను స్మరించి, వారికి ఘనంగా నివాళులర్పించారు.
కీ.శే. అధరాపురపు శేషగిరిరావు, కీ. శే. బొడ్డుపల్లి సీతారామస్వామిశాస్త్రి, కీ.శే. కొండముది రామకృష్ణ, కీ.శే.పన్నాల రాధాకృష్ణశర్మ ప్రభృతుల త్యాగనిరతినీ, అకుంఠిత దీక్షనూ ఆదర్శంగా తీసుకుని ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అమ్మను, అమ్మ సంస్థనూ ఆదరించి తీర్చిదిద్దిన పెద్దలను మరువలేమని, అవకాశం ఉన్నంతలో అన్న సంతర్పణలు, ఉపకార వేతనాలు అందించి, అమ్మ ఆశయాన్ని ఆచరణ రూపంలో లోకానికి వెల్లడించటమే ఈ ఉత్సవాన్ని తమ ప్రాంతంలో నిర్వహించటంలోని ఆంతర్యమని స్పష్టం చేశారు. విద్యతో పాటు క్రమశిక్షణను సముదాత్త జీవన వైఖరినీ నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సేవానిరతిని బోధించి, తమకు మార్గదర్శనం చేస్తున్న విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.కాకినాడ: పూర్వవిద్యార్థి పి.అప్పారెడ్డి నేతృత్వంలో – మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవ సభ, అన్నప్రసాద వితరణ వైభవంగా జరిగాయి. ఎందరో పేదవిద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున ఉపకార వేతనాలు ఇచ్చారు.తెనాలి, రేపల్లె : పట్టణ ప్రముఖలతో సభలు నిర్వహించి, పూర్వవిద్యార్థులు అన్నప్రసాదం పంచి పెట్టారు.
పార్వతీపురం : 6వ తేది ఉ.10గంటలకు రాజా హిందీ శిక్షణ కళాశాలలో స్వర్ణోత్సవ సంరంభానికి శుభారంభం జరిగింది. శ్రీ గంటేడ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో విద్యావేత్త శ్రీ మంచిపల్లి శ్రీరాములు ప్రారంభోపన్యాసం చేశారు. పార్వతీపురం డి.యస్.పి. శ్రీ ఎ.సుభాష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శ్రీ గంటేడ చిన్నంనాయుడు నేతృత్వంలో ఎందరో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలు, పురప్రముఖులు అమ్మ ప్రేమతత్త్వాన్ని కీర్తిస్తూ అంజలి ఘటించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఫుడ్‌బ్యాంకు పేరుతో పూర్వవిద్యార్థులు ఏర్పాటు చేసిన “అమ్మ అన్న ప్రసాద వితరణ” కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంటు శ్రీమతి వాగ్దేవి ప్రారంభించారు. పేదలకు, వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు అన్నప్రసాదం పంచారు. ముఖ్యవిశేషం ఏమిటంటే, 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికీ నిరాటంకంగా సాగుతోంది.పాలకొండ : జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో – మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జామి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని, సందేశం అందించారు. పూర్వవిద్యార్థులు మజ్జి సత్యం అధ్యక్షతలో జరిగిన ఈ సభను బౌరోతు శంకరరావు వ్యాఖ్యాతగా నిర్వహించారు. వ్యవహరించాడు. ఈ సందర్భంగా అమ్మ ఫోటోలను, బౌరోతు శంకర్రావు వ్రాసిన “జిల్లెళ్ళమూడి అమ్మ జీవిత చరిత్ర” గ్రంథాలను అందరికీ పంచిపెట్టారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున ఉపకారవేతనం అందించారు. అనంతరం అందరికీ “మహాప్రసాదం” (భోజనం) ఏర్పాటు చేశారు.రాజాం : రాజాం పట్టణంలో పూర్వవిద్యార్థి పి.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో ఫుడ్‌బ్యాంక్ ప్రారంభించి, అమ్మ ప్రసాదమైన అన్నం ఎందరికో పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, కరోనా రోగులకు సేవలు నిర్వహించారు.రాజమహేంద్రవరం : అమ్మ కళాశాల స్వర్ణోత్సవం రాజమహేంద్రవరం శ్రీ గాయత్రీ దత్తాత్రేయ వేదపాఠశాలలో జరిగింది. మాతృశ్రీ పూర్వవిద్యార్థి మరువాడ కామేశ్వరశర్మ నేతృత్వంలో వేద విద్యార్థులకు భోజన వసతి కోసం రూ.7,000/ నగదు, బియ్యం, కందిపప్పు, పంచదార మొదలైన నిత్యావసర సరుకులు సమర్పించారు.విజయనగరం : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవసభలో విజయనగరం జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి కె. సుధామణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖాధికారి శ్రీ రాజారావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అతిథులందరూ అమ్మ మహనీయతను, విద్యార్థుల కార్యదీక్షను ప్రశంసించారు. గతంలో తాము జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని, ఆశీస్సులు పొందామని ప్రకటించారు. సభానంతరం ఎందరో వికలాంగ యాచకులకు అమ్మప్రసాదంగా భోజనం పెట్టి, దుప్పట్లు పంచి పెట్టారు. పూర్వవిద్యార్థి త్రినాధ్ పర్యవేక్షణలో అక్కడి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి.విశాఖపట్నం : చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల “స్వర్ణోత్సవం” విశాఖలో ఘనంగా విశాఖ డి.యస్.పి.శ్రీ బి. విజయకుమార్, అరబిందో ఫార్మాలిమిటెడ్ డి.జి.ఎం. శ్రీ ఎన్. వెంకట రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం. రాజబాబు, శ్రీమతి ఎ.జయప్రద, పేరెంట్స్‌కమిటీ ప్రతినిధులు శ్రీశ్రీనివాస్, శ్రీ సూరిబాబు ప్రభృతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూర్వవిద్యార్థి పొట్నూరు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అందరూ అమ్మ ఆశయాల ఔన్నత్యాన్ని, కళాశాల క్రమశిక్షణ వాతావరణాన్ని కొనియాడారు. అన్నం పెట్టటం, వస్త్రాలు ఇవ్వటం, వైద్యసహాయం మొదలైన సేవలన్నీ మాతృయాగంలో భాగమని అన్నారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యిరూపాయలు చొప్పున ఉపకార వేతనం, ప్రశంసాపత్రం, అమ్మ కేలండర్, శివ లెంక ప్రసాదరావు రచించిన గ్రంథాలు అందించారు.శ్రీకాకుళంలో సాలూరులో “అమ్మ బడి” పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల జరుగుతున్నాయి. సాలూరులో రక్తదాన శిబిరాలు నిరంతరం నిర్వహిస్తున్న శివలెంక ప్రసాదరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పేదవిద్యార్థులకు – వెయ్యేసి రూపాయల చొప్పున విస్తృత స్థాయిలో ఉపకారవేతనాలు పంపిణీ జరిగింది.
వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో గంటేడ సోమేశ్వరరావు, తామాడ సూర్యనారాయణ, ఎం.జగన్నాధం, కొక్కిలిగడ్డ సూర్యనారాయణ, అరటికట్ల కామేశ్వరరావు, ఎ. హరిబాబు, హరనాధ్, భవిరిపూడి శ్రీరామమూర్తి, తులసీరావు, ఎ.వి.వి. రాజారావు, తెంటు కృష్ణమూర్తి, దత్తి కృష్ణ, పూడి కృష్ణ, దత్తి సూర్యనారాయణ, గౌరీప్రసాద్, దాసరి శ్రీరామమూర్తి, ఎ.యస్.వరప్రసాద్, జె. శేషాద్రి, రాఘవేంద్రరావు మొదలైన ఎందరో పూర్వ విద్యార్థులు సమధికోత్సాహంతో పాల్గొన్నారు.కుంభమేళా సందర్భంగా ఉత్తరభారతంలో విస్తృతంగా “అమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలుజరిగాయి. పూర్వ విద్యార్థుల ప్రతినిధిగా డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ బాధ్యతను స్వీకరించి, నిర్వహించాడు. కళాశాల స్వర్ణోత్సవ సంరంభం అమ్మ అన్నప్రసాద వితరణం ఆనాడే ప్రారంభం అయ్యాయి.ఈ పూర్వ విద్యార్థులందరూ అమ్మ కరుణకు పాత్రులైన అదృష్టవంతులు. భావితరాలకు ఆదర్శ మూర్తులు. ఈ స్వర్ణోత్సవాలను నిర్వహించి, సేవ, ప్రేమ, త్యాగము, కరుణ మొదలైన అమ్మ ఆశయాలను ఆచరణాత్మకంగా అనుసరించిన అమ్మ తత్త్వ ప్రచార సాధకులు ఈ పూర్వవిద్యార్థులు. బాధ్యతా యుత మూర్తులైన ఈ ఆదర్శవిద్యార్థులను శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాయి. అమ్మ ఆశీస్సులలో వీరందరూ సకలాభీష్టాలు పొందాలని, ఇలాగే మరెన్నో సేవాకార్యక్రమాల ద్వారా అమ్మ తత్త్వాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షిస్తూ…
అభినందనలతో ఆశీస్సులతో శుభాకాంక్షలతో… సంపాదకవర్గం, “విశ్వజనని”
by admin | Mar 22, 2021 | Orientation Programm
గత అయిదు దశాబ్దాలుగా ప్రతిష్ఠాత్మకంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దిగ్విజయంగా నడపబడుతుంది. ఎన్నో మైలురాళ్ళుదాటుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మన కళాశాలకు 22.03.2021 సోమవారం రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి FFC (Fact Finding Committee) వారు విచ్చేశారు. Dr.N.V. కృష్ణారావు H.O.D (Department of Oriental Language) Dr.E.V. పద్మజ Department of History and Archeology Visit చేశారు. మన కళాశాలకు స్వయంగా విచ్చేసిన ప్రొఫెసర్స్ ఇద్దరూ కూడా కళాశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి మూల్యాంకన చేశారు. Documents ను కూడా పరిశీలించి కళాశాల గుర్తింపును కొనసాగిస్తామని తెలిపారు. విశ్వజననీ పరిషత్ వారు అధికారులకు అమ్మ శేషవస్త్రాలను సమర్పించి సత్కరించారు. 4 రోజులపాటు విద్యార్థులు అధ్యాపకు లందరి పర్యవేక్షణలో కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కళాశాల కరస్పాండెంట్ డా॥బి.యల్. నుగుణ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామవంశీ గారు విద్యార్థులను అభినందించారు.
by admin | Feb 21, 2020 | Orientation Programm
అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21:2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజనని పరిషత్ కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ జి.వై.యస్.బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవానికి ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్షత వహించారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ మన సంప్రదాయాలను కాపాడుతూ అమ్మతత్త్వాన్ని దశదిశలా వ్యాప్తి చేసి, భావితరాలకు అందించాలని కోరారు. విద్యార్థి జీవితంలో ఈ వార్షికోత్సవాలు ఒక మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని, భవిష్యత్తులో ఈ సంస్థ అభివృద్ధికి అమ్మ ఆశయాలకు అనుగుణంగా పూర్వవిద్యార్థి సంఘం నిలుస్తుందని ప్రిన్సిపాల్ హనుమంతయ్య గారు ఆశాభావం వ్యక్తం చేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. యమ్. చంద్రమోహన్ గారు (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మోడల్స్ ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరునుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణ గారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్ధులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు వై.వి. శ్రీరామ్మూర్తిగారు, మోహనకృష్ణ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు పాల్గొని తమ ఆశీస్సులను విద్యార్థులకు అందించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
by admin | Jan 25, 2020 | Orientation Programm
గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, జిల్లెళ్ళమూడి గ్రామసరోవరంలో అరవిరిసిన వారిజాతం నెఱవిరిసిన పారిజాతం మన “మాతృశ్రీ ఓరియంటల్ విద్యాలయం”. ప్రాచ్య విద్యాను గంధాన్ని దిగంతాలకు వెదజల్లాలనే సత్సంకల్పంతో జగన్మాత శ్రీపరాత్పరి రాజరాజేశ్వరి అనసూయా దేవి- జ్ఞానపుష్పాలతావి అయిన అమ్మ స్వహస్తాలతో 1971 లో కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాల మొదట ఆంధ్రాయూనివర్సిటీ అప్లియేషన్తో ప్రారంభమై, ఆ తరువాత 1978 నుండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధమై ఉన్నది.
శ్రీ విశ్వజననీ పరిషత్ ద్వారా కళాశాలలో చేరిన ఆంధ్ర-తెలంగాణ పరిసర సుదూరప్రాంతాల విద్యార్థులకు “డ్రస్సు అడ్రస్సుతో నిమిత్తం లేకుండా” ఉచితవిద్య, వసతి, భోజన, వైద్య సౌకర్యాలు దాదాపు 5 దశాబ్దాలుగా నిర్విరామంగా కల్పించడం గొప్ప విశేషం.
రాష్ట్రంలోనే మొదటి ఓరియంటల్ కళాశాలగా NAAC గుర్తింపుకు వెళుతున్న తరుణంలోశ్రీ విశ్వజననీ పరిషత్ పెద్దలు మరియు కరస్పాండెంట్ శ్రీ జి.వై.యస్.బాబుగారి ప్రయత్నంతో నవంబర్ 29, 2019న నెల్లూరు వేదసంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. శ్రీ విశ్వజననీ పరిషత్ జనరల్ సెక్రటరీ, శ్రీ కామరాజు గారు మరియు కరస్పాండెంట్ గారి ఆర్థిక, హార్దిక సహకారం మరియు ప్రియవిద్యార్థుల శ్రమదానంతో ప్రిన్సిపాల్ గారు. 17 రోజులలో కళాశాల ఆవరణాన్ని చూడముచ్చటగా తయారు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
2019-20 విద్యాసంవత్సరంనకు సంబంధించి రాష్ట్ర నలుమూలలనుండి 174(122+52) విద్యార్థినీ, విద్యార్థులు కళాశాలలో చేరియున్నారు. వీరిలో అర్హులైన దాదాపు 95 మందిని జ్ఞానభూమి పోర్టల్‌లో నూతనంగా “జగనన్న విద్యాదీవెన” స్కాలర్ షిప్ లకు కళాశాలలో రిజిష్టర్ చేయడం వలన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించినట్లయినది.
శ్రీవిశ్వజననీ పరిషత్ మరియు పూర్వవిద్యార్థుల సహకారంతో ప్రిన్సిపాల్ మరియు కళాశాల సమితి ఆర్థిక అధ్యాపకులు డిసెంబర్ 15, 2019 నుండి ప్రతిరోజు సాయంత్రం 5గంటలకు స్నాక్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జనవరి 5, 2020 న మేనేజ్ మెంట్ వారి సహకారంతో బాయ్స్ విద్యార్థుల సౌకర్యార్ధం మొదటి సారిగా హాస్టల్ లో ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేయటంతో సుదూరప్రాంతాలలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం విద్యార్థులకు కల్పించబడింది.
క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగించి చదువులో రాణించడానికి మరియు ఉత్తేజపరచడానికి ఎంతగానో దోహదపడతాయి. అటువంటి క్రీడలలో వార్షికపోటీలను జనవరి 7,8,9 – 2020 తేదీలలో అధ్యాపకులందరి సమక్షంలో నిర్వహించడం వలన విద్యార్థులలో స్పోర్టివ్ నెస్ ని కలిగించి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది.
అమ్మా- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం, ఎవడు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అని చెప్పిన అమ్మ సూక్తుల ప్రమాణంగా, కరస్పాండెంట్ గారి మార్గదర్శనంతో కళాశాలలో జనవరి 10, 2020న ఉదయం 10 గంటలకు పేరెంట్ – టీచర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాలల అధ్యాపకబృందం సాదరంగా ఆహ్వానించిన విధానం పేరెంట్స్ ను మైమరచేలా చేసింది. 112 మంది తల్లిదండ్రులతో ప్రార్థనామందిరంలో సంస్థ పెద్దల సమక్షంలో పేరెంట్ – టీచర్స్ మీట్ ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన అధ్యాపకుల సహకారంతో దిగ్విజయంగా జరిగింది.
25.1.2020 శనివారం నాడు నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులకు ఓటుహక్కు విలువను కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య తెలియజేశారు. అదేరోజు బాడీ ఫిటినెస్ఎవేర్ నెస్ ప్రోగ్రామ్ జరిగింది. శరీర దృఢత్వం దానివలన కలిగే మానసిక వికాసములు గురించి యోగా ట్రైనర్ అయిన శ్రీమతి సంగీత అంకతగారుప్రయోగాత్మక యోగాసనాలతో విద్యార్థులను ఉత్తేజపరచారు.
జనవరి 26 న రిపబ్లిక్ డే ఉత్సవాలను వినూత్నంగా సంస్థపెద్దలను ప్రిన్సిపాల్ గారు గార్డ్ ఆప్ ఆనర్ తో ఆహ్వానించిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహ్వానితులు అవరసరస్వతి జగన్మాత అమ్మకు, అలాగే రాజ్యాంగ నిర్మాత డా॥బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయజెండాను గౌరవవందనంతో ఎగురవేశారు.
గణతంత్రదినోత్సవాన్ని ప్రిన్సిపల్ అధ్యక్షతన కళాశాల ప్రార్థనామందిరములో పెద్దల ఉపన్యాసాలతో, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయనాయకులను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో యువత ప్రధాన భూమికయని ప్రెసిడెంట్ శ్రీ దినకర్ గారు విద్యార్థులనుద్దేశించి ఉపన్యసించారు.
ఫిబ్రవరి 7 వ తేదీన ఆర్.టి.సి. స్పెషల్ బస్సులో జిల్లెళ్ళమూడి నుండి ఉదయం 7.35 ని.లకు వైజ్ఞానిక యాత్రకు ఫైనల్ విద్యార్థులు బయలుదేరినారు. 9.30 గంటలకు 150 సంవత్సరాలు మన చరిత్ర కలిగిన గుంటూరు హిందూ సంస్థలను దర్శించారు. మన కళాశాల కరస్పాండెంట్ జి.వై.యన్. బాబు గారు విజ్ఞానయాత్రను అభినందిస్తూ వచ్చిన బృందానికి ఆదరంగా స్వల్పాహారాన్ని గారు నెల్లూరు నుండి పంపించారు. ఏర్పాటు చేసారు.
మనకరస్పాండెంట్ గారికి మరియు హిందూ హైస్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి, 11 గంటలకు యాత్రబృందం బయలుదేరి 12 గంటలకు అమరావతిలోని బౌద్ధారామం, రామలింగేశ్వర దేవాలయం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ బొప్పూడి వివరించారు. రామబ్రహ్మంగారి నివాసానికి చేరినాము. విజ్ఞానయాత్రకు వచ్చిన 36 మంది విద్యార్థులకు మరియు 6 మంది అధ్యాపక సిబ్బందికి రుచికరమైన కుటుంబసభ్యులందరూ కలసి భోజన పదార్థాలను ఆదరంగా వడ్డించిన విధానం మరువలేనిది.
13.2.2020 గురువారం రోజు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. కె.నిర్మలాజ్యోతి ఆర్.ఆర్.సి. మాష్టర్ ట్రైనర్, జె.యమ్.జె. కాలేజ్, తెనాలి, పాజిటివ్ స్పీకర్ గా బాపట్ల నుండి యమ్. సుబ్బమ్మ గారు వచ్చి హెచ్.ఐ.వి. వచ్చిన వారు అధైర్యపడకుండా ఉండాలని తెలియజేశారు. ఈ సదస్సులో శ్రీమతి కె.అపర్ణ, మెడికల్ ట్రైనర్ విద్యార్థులకు హెచ్.ఐ.వి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. మన కళాశాల యస్.యస్.యస్. కో-ఆర్డినేటర్ శ్రీ జి. రాంబాబు గారు సమన్వయ కర్తగా వ్యవహరించారు.
ఫిబ్రవరి 20వ తేది ఉదయం విద్యార్థినులు వసతిగృహంలో, 21తేదీన విద్యార్థుల వసతి గృహంలో అమ్మ ఆగమన ఉత్సవాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకొని రాబోవు పరీక్షలకు అమ్మ ఆశీస్సులు పొందినారు.
ఫిబ్రవరి 21 వ తేదీ మధ్యాహ్నం నుండి సంస్థ పెద్దల ఆశీస్సులతో కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా విద్యార్థుల ఆటపాటలతో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రార్థనా మందిరం శోభాయమానమయినది. 18 రకాల క్రీడలలో పాల్గొని విజేతలైన దాదాపు 137 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులకు వినూత్నరీతిలో అమ్మ ప్రతిమతో ప్రత్యేకంగా ముద్రించిన 8 రకాలగోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు, కాలేజీ ట్రోపీ మరియు షీల్డ్స్ సంస్థ పెద్దలచే బహూకరించబడినవి. దాదాపు రూ. 15000 విలువైన మిరుమిట్లు గొలిపే బహుమతులన్నింటినీ అమ్మకు ప్రీతిపాత్రుడైన ఫార్మర్ ఫిజికల్ డైరెక్టర్, శ్రీ చంద్రమోహన్
4.3.2020 బుధవారం నాడు కోవిడ్ – 19 కరోనా వైరస్ ను గురించిన ఎవేర్ నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ అవగాహన సదస్సులో బాపట్ల నగర ప్రఖ్యాత వైద్యులు డా. ఇనజకుమారి గారు కరోనా వైరస్ దానివలన కలిగే అపాయాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరములో 200 నాడు ప్రముఖ పాత్రికేయులు, సాహితీవేత్త ప్రత్యేకించి శ్రీ విశ్వజననీపరిషత్ పార్మర్ ప్రెసిడెంట్ గారైన స్వర్గీయ శ్రీ పొత్తూరి వేంకటేశ్వరావుగారి సంస్మరణ సభను సంస్థ పెద్దల మార్గదర్శనంతో ఘనంగా జరిగింది.
2019-20 విద్యాసంవత్సరంనకు గాను రాష్ట్ర నలుమూలలనుండి 174 మంది విద్యార్థులు. కళాశాలలో చేరియున్నారు. వారిలో 120 మంది నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు మార్చి 15 నాటికి పరీక్షలు వేసింది. పూర్తిచేసుకుని వారి స్వస్థలాలకు రైల్వే కన్సెషన్ పామ్స్ తో (కొంతమందికి) క్షేమంగా చేరినట్లు తెలిసినది.
జిల్లెళ్లమూడి నుండి బాపట్లలో పరీక్షలు వ్రాయు విద్యార్థులకు కొంతమేర ప్రయాణసాధనంగా ఉంటుందని మరమ్మత్తులకు గురై కొన్నాళ్ళుగా షెడ్ లో నిరుపయోగంగా ఉన్న సంస్థ అంబులెన్స్ ను జనరల్ సెక్రటరీ శ్రీ కామరాజు గారి సూచనల మేరకు ప్రిన్సిపాల్ గారు ఆ వాహనాన్ని డా. హనుమత్ ప్రసాద్ గారి ద్వారా చీరాలకు పంపించి, రిపేర్ చేయించి, కండిషన్ లోకి తీసుకురావడంతో విద్యార్థులకు ప్రయాణసాధనమైనది. దానికైన ఖర్చు రూ.14000 లు. అందులో రూ.10000 లు జనరల్ సెక్రటరీ గారు ఇవ్వగా, మిగిలిన రూ.4000 ప్రిన్సిపాల్
మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మన ఓల్డ్ స్టూడెంట్ మరియు 2016 సంఘటన. డి.యస్.సి. లో సెలక్ట్ అయిన చి. వేంకటాచారి మార్చి 9వ తేదీన ఫైనల్ విద్యార్థులకు టి.పి.టి./బి.యిడి. ఎంట్రన్స్ పరీక్షల గురించి అవగాహన కల్పించారు.
మార్చి 14 శనివారం రోజున ఫైనల్ ఇయర్ మన పూర్వ విద్యార్థి డా.యమ్.రామచంద్రరావు గారిచే టి.పి.టి./ బి. యిడి. ఎంట్రన్స్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించి విద్యార్థులలో మనోధైర్యాన్ని, భవిష్యత్ కార్యాచరణను, పరీక్షలపట్ల కార్యోన్ముఖులను చేసారు. ఈ సందర్భంగా మన కళాశాల పూర్వవిద్యార్థి, రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ శ్రీ గోలి రామచంద్రరావు గారు విద్యార్థుల కొరకు పోటీపరీక్షల పుస్తకాలనిమిత్తం రూ.5000లు ధాన్యాభిషేకం నాడు ప్రిన్సిపాల్ గారికి ఇచ్చినారు. దానికి రూ.3000లు చేర్చి, మొత్తం రూ.8000లకు ప్రిన్సిపాల్ గారు పుస్తకాలను పెద్దల సమక్షంలో విద్యార్థులకు బహూకరించారు.
వేదిక్ యూనివర్సిటీ క్రింది ఉన్న 45 మంది విద్యార్థులకు ఏప్రియల్ 4 నుండి పరీక్షలు జరుగుసని యూనివర్సిటీ తెలియజేసియున్నది. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 22 న జనతాకర్ప్యూ తరువాత నుంచి భారతప్రభుత్వం విడతలవారీగా లాక్ డౌన్ ల దరిమిలా వేదిక్ యూనివర్సిటీ ఏప్రిల్ 4 నుండి జరుగవలసిన పరీక్షలను వాయిదా వేసింది.
కరోనా సమయంలోనే కమీషనర్,ఆర్. జె.డి. వారి ఆదేశాలమేరకు మరియు కరస్పాండెంట్ గారి సూచనల మేరకు ఏప్రిల్ 17 వ తేదీ నుండి కళాశాల అధ్యాపకులు ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటూ తరగతులు నిర్వహించడం,ఓరియంటల్ కళాశాలలో గొప్ప విశేషం.
లాక్ డౌన్ కారణంగా జిల్లెళ్ళమూడి క్షేత్రంలో చిక్కుకుపోయిన 45 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించుటలో సంస్థ పెద్దలు మరియు కళాశాల కరస్పాండెంట్ గారు చొరవతీసుకుని, ప్రభుత్వాధికారులతో చర్చించి, మే 22 వ తేదీన జిల్లెళ్ళమూడి నుండి ప్రత్యేకవాహనాల ద్వారా విద్యార్థులను విజయవాడ వరకు చేర్చి, అక్కడనుండి మరొక ప్రత్యేక బస్సులో వారినందరినీ గమ్యస్థానాలకు చేర్చినవిధానం ఒక సాహసోపేత సంఘటన.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సర్యులర్ ప్రకారం జూలై 6 వ తేదీ నుండి 2020-21 విద్యాసంవత్సరం సిలబస్ ను ఆన్ లైన్ /కాన్ఫరెన్స్ క్లాసులు ద్వారా ప్రారంభించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు ప్రత్యేకమైన సమయసారిణిని ప్రకారం విద్యార్థులకు ఆన్ లైన్ – కాన్ఫరెన్స్ క్లాసులు మొదలుపెట్టారు. విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకుంటూ, కరోనా సమయంలో జాగ్రత్తలు తెలియజేస్తూ, ఐ.సి.టి మోడ్ లో నూతన పాఠాలను ప్రారంభించి ఇతర కాలేజ్ లకు ధీటుగా ఓరియంటల్ ఉపయోగించుకుంటూ విద్యాపరంగా నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఈ విధానాన్ని మొదటగా ప్రోత్సహించిన కరస్పాండెంట్ శ్రీ జి.వై.యస్ బాబుగారికి ధన్యవాదాలు మరియు విద్యార్థులకు లాక్ డౌన్ లో సైతం టెక్నాలజీ ద్వారా విజ్ఞానాన్ని అందిస్తున్న కళాశాల అధ్యాపకులకు అభినందనలు. అధ్యాపకుల ఆన్ లైన్ క్లాసుల ఫీడ్ బ్యాక్ ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి కళాశాల నుంచి సి.సి.ఇ. వెబ్ సైట్ కి పంపిస్తున్న కంప్యూటర్ ప్యాకల్టీ శ్రీ వి. రోషన్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు.
by admin | Jan 20, 2020 | Orientation Programm
10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలోనే విద్యార్థుల తల్లిదండ్రులలో ఒక విద్యార్ధితల్లిని, ఒక విద్యార్ధితండ్రిని వేదికమీదకు ఆహ్వానించి వారికి సముచిత స్థానం కల్పించి గౌరవించడం జరిగింది. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామనీ శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు. తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో ఇంకా ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని వారు ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.