యోగాంధ్ర కార్యక్రమం – సంక్షిప్త నివేదిక
(జూన్ 7 – జూన్ 21, 2025)
జూన్ 7 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం లో భాగంగా ప్రతిరోజూ ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల బాలికల మరియు బాలుర వసతి గృహాలలో యోగా సాధన చేయించారు. కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజున బాపట్ల నుండి వచ్చిన యోగా శిక్షకులు శ్రీ Ch.కేశవులు గారు విద్యార్థులతో యోగా సాధన చేయించారు.
తరువాత నిర్వహించిన సభలో SVJP TRUST Honorary Chairman శ్రీ M. దినకర్ గారు, Managing Trusty శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీ వల్లూరి ప్రేమ్ కుమార్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్‌ప్రసాద్ గారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని సంస్కృత విభాగాధిపతి శ్రీ ఆర్. వరప్రసాద్ నిర్వహించారు. చివరిగా యోగా శిక్షకులకు మరియు వారి బృందానికి యాజమాన్యం వారు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది. యోగా అనేది శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపేందుకు సాయంత్రం కళాశాల నుండి అధ్యాపకులు విద్యార్థులు జిల్లెళ్ళముూడి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.   గ్రామప్రజలకు యోగా గురించి అర్థమయ్యేలా  వివరించి చెప్పారు. 15 మంది అధ్యాపకులు 142 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.