స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 20/09/2025  శనివారం రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు “Green AP” గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు సమావేశం నిర్వహించాము. ఈ సభలో  ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -1 ప్రోగ్రాం ఆఫీసర్ మరియు అథ్యాపకులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి  అవగాహన కల్పించారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జి. గోవిందరాజులు గారి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించబడింది.  కార్యక్రమంలో భాగంగా  కళాశాలలో అథ్యాపకులు విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. 14 మంది అథ్యాపక,అథ్యాపకేతర సిబ్బంది  మరియు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ సంరక్షణ పట్ల బాధ్యతా భావం పెంపొందించబడింది.