by admin | Dec 28, 2018 | Awarness Programs
పాఠ్యగ్రంథాలతో పాటు నైతిక, ధార్మిక విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు సాధించుకోవాలని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు హితవు పలికారు. డిసెంబరు 28న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా నానాటికీ అభివృద్ధి చెందుతున్నదని ఆయన తెలిపారు. ఈ సభలో విజయవంతంగా విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన రామబ్రహ్మంగారికి శ్రీ సుధామ వంశీగారు అభినందనలు తెలిపారు.
by admin | Dec 28, 2018 | Awarness Programs
ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని, దాని ఆవశ్యకతను తెలుసుకోవాలని బొప్పూడి రామబ్రహ్మంగారు సూచించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, ఉభయపరిషత్తుల అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డిసెంబరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో బి.రామబ్రహ్మంగారికి అభినందనలు తెలిపారు.
by admin | Nov 24, 2018 | Awarness Programs
రవాణారంగం పటిష్టంగా ఉండాలంటే రోడ్డురవాణా భద్రత ముఖ్యమని వెదుళ్లపల్లి SI వివరించారు. నవంబరు 24 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యం.మోహన్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు. నియమ నిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అలవరుచుకోవాలని అయన తెలిపారు. చట్టాలను పాటించడంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థుల కర్తవ్యమని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చట్టాలు పాటించడంతోపాటు సమాజ శ్రేయస్సుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
by admin | Nov 24, 2018 | Awarness Programs
రవాణారంగం పటిష్ఠంగా ఉండాలంటే రోడ్డు రవాణా భద్రత ఎంతో ముఖ్యమని వెదుళ్లపల్లి యస్.ఐ. శ్రీ యమ్.మోహన్ వివరించారు. 2018 నవంబరు 24వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలలో యస్.ఐ. పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్గారు డా.ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపట్ల అవగాహన ఉండాలని తెలిపారు. క్రమశిక్షణలో నియమనిబంధనలను పాటించడం ఇప్పటి నుండే అ లవరచుకోవాలని ఆయన హితవు పలికారు. చట్టాన్ని గౌరవించడం ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వటం విద్యార్థుల కర్తవ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సమాజప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
by admin | Aug 29, 2018 | Awarness Programs
కళాశాలలో 29.8.2018న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు, మన కళాశాల పూర్వవిద్యార్థి శ్రీ శేషాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో అజంత భాషలెన్ని ఉన్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులోకి చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా తెలియజెప్పారు. | తెలుగు భాషకే సొంతమైన అవధానప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యవహార భాషోద్యమకారులైన గిడుగువారి కృషిని శ్లాఘిస్తూ తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ మధుసూదనరావుగారు, కె.వి. కోటయ్య గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుగుణగారు మాట్లాడారు. ఈ కార్యక్రమములో భాగంగా శోభన, అనూష అల్లసాని పెద్దనగారు రచించిన ఉత్పలమాలికను ఆశువుగా చెప్పారు. నంబూరు జడ్.పి. హైస్కూల్ విద్యార్థులైన షేక్నిగా, షేక్ సాహెబ్ పోతన నృసింహావతార ఘట్టము లోని గద్యమును అనర్గళముగా పఠించారు.
by admin | Aug 23, 2018 | Awarness Programs
ఐక్యభావన వల్లనే సమాజం పురోగమిస్తుందని ప్రభాకర స్వామి (హైదరాబాద్) వివరించారు. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సేవాభావం, పరస్పర సహకారం, త్యాగభావం వల్లే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కార వంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యమని ప్రబోధించారు. వైషమ్యాలు, విద్వేషాలు, దురాలోచనలు, హింస, స్వార్థం సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని హెచ్చరించారు. మన సంస్కృతి, సమాజం గొప్పదనాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. భారతీయుల ఉత్తమ సంస్కృతి ప్రపంచాన్ని ఆకట్టుకుందని, అందువల్ల మన సంస్కృతి ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రబోధించారు. సత్సంప్రదాయాలను కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రభాకర స్వామివారి ప్రసంగం విద్యార్థినీ విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుగుణగారు, ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.